పొదలకూరు,(అక్షర దర్శిని):
పొదలకూరు బిట్-4 వైసీపీ ఎంపిటిసి అభ్యర్థి దాసరి. కల్పన లింగంపల్లి తోపులో సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరిగి వైసీపీ జడ్పీటిసి, ఎంపిటిసి అభ్యర్థులను, అత్యధిక మెజారిటీతో గెలిపించాలన్నారు. కూటమి ప్రభుత్వంలో పంచాయతీ పాలన నిర్వీర్యంగా మారిందన్నారు. కార్యక్రమంలో మాజీ వార్డు మెంబెర్ చేమికల వెంకీ యాదవ్, మాజీ ఎంపిటిసి గుంటి శ్రీనివాసులు, వెంకటరామిరెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, పాల్గొన్నారు.