పొదలకూరు,(అక్షర దర్శిని):
నెల్లూరు జిల్లా పొదలకూరులో సోమవారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. స్థానిక యమహా షోరూంలో మెకానిక్‌గా పనిచేస్తున్న యువకుడు విద్యుత్ షాక్‌కు గురై ప్రాణాలు కోల్పోయాడు. బైక్‌కు వాటర్ సర్వీసింగ్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.
విధుల్లో ఉండగా ప్రమాదం
నెల్లూరు నగరంలోని డైకస్ రోడ్డులో ఉన్న ఎన్‌సీసీ కాలనీకి చెందిన మోహిద్ (29) పొదలకూరులోని యమహా షోరూంలో మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. ప్రతిరోజూ నెల్లూరు నుంచి పొదలకూరుకు వచ్చి విధులు నిర్వహించి తిరిగి ఇంటికి వెళ్లేవాడు. ఈ క్రమంలో సోమవారం యథావిధిగా విధుల్లో ఉన్న మోహిద్ బైక్‌కు వాటర్ సర్వీసింగ్ చేస్తుండగా విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం.
కుటుంబంలో తీరని విషాదం
మోహిద్‌కు భార్యతో పాటు ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు. కుటుంబానికి ఆధారంగా ఉన్న యువకుడు ఆకస్మికంగా మృతి చెందడంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. చిన్న వయసులోనే మోహిద్ మృతి చెందడం స్థానికంగా విషాదాన్ని నింపింది. సమాచారం అందుకున్న పొదలకూరు ఎస్ఐ శివరాకేష్ ఘటనాస్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.