నెల్లూరు జిల్లా కలువాయి మండలంలోని బెస్తపాలెంలో కలువాయి బిట్-1, బిట్-2 ఎంపీటీసీ అభ్యర్థులు చల్లా రఘురామిరెడ్డి, నూటేటి నరసింహులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలిసి తమ అభ్యర్థిత్వాన్ని పరిచయం చేసుకుంటూ ఓట్లు అభ్యర్థించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటూ, గ్రామంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి అవసరాలకు అనుగుణంగా పనిచేస్తామని పేర్కొన్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని అభ్యర్థులతో కలిసి ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. రాబోయే ఎంపీటీసీ ఎన్నికల్లో తమకు మద్దతు తెలిపి ఆదరించాలని అభ్యర్థులు ప్రజలను కోరారు.


