Akshara Darshini
Date of Publish : 26/10/2026, 6:15 pm
Published by Kadiyala Chinmaya Reddy

ఆత్మకూరులో వైసీపీకి మరో ఎదురుదెబ్బ

  • టీడీపీలో చేరిన డాక్టర్ ప్రణీత్‌.. మంత్రి ఆనం సమక్షంలో పార్టీ మార్పు

ఆత్మకూరు,(అక్షర దర్శిని):

ఆత్మకూరు మున్సిపల్ ఎన్నికల వేళ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో కీలక నేత దూరమయ్యారు. వైసీపీ డాక్టర్స్ సెల్ జిల్లా అధ్యక్షుడు, ప్రజా వైద్యశాల అధినేత డాక్టర్ ప్రణీత్‌ తన అనుచరులు, అభిమానులతో కలిసి సోమవారం తెలుగుదేశం పార్టీలో చేరారు. రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సమక్షంలో ఈ చేరిక కార్యక్రమం జరిగింది.డాక్టర్ ప్రణీత్‌తో పాటు డాక్టర్ హారిక, డాక్టర్ వెంకటేశ్వర్లు కూడా టీడీపీలో చేరినట్లు సమాచారం. ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.ఆత్మకూరు పట్టణంలో వైద్యరంగంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా గుర్తింపు పొందిన డాక్టర్ ప్రణీత్‌ టీడీపీలో చేరడం స్థానిక రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆయనతో పాటు అనుచరులు, అభిమానులు కూడా పార్టీ మారడం ప్రాధాన్యం సంతరించుకుంది.మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆత్మకూరులో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఇప్పటికే పలువురు వైసీపీ నాయకులు టీడీపీలో చేరిన నేపథ్యంలో డాక్టర్ ప్రణీత్‌ చేరికతో స్థానికంగా ఎన్నికల రాజకీయాలపై ఆసక్తి నెలకొంది. ఈ పరిణామం మున్సిపల్ ఎన్నికల్లో ఆయా పార్టీలపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది వేచి చూడాలి.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Akshara Darshini.
PDF Share Save