Akshara Darshini
Date of Publish : 26/10/2026, 9:13 pm
Published by hameed

పొదలకూరు మండలంలో 17 మంది ఎంపీటీసీ అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణ.

పొదలకూరు మండలంలో జరగనున్న మండల ప్రజా పరిషత్ ప్రాదేశిక నియోజక వర్గం (ఎంపీటీసీ) ఎన్నికల్లో 17 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు అని రిటర్నింగ్ అధికారి విజయ కుమార్ రెడ్డి తెలిపారు. ఫారం - VIII ప్రకారం ఈ వివరాలను ప్రకటించారు. పొదలకూరు-1 నుండి గంగవరపు రాధా కళ్యాణి, పొదలకూరు-2 నుండి గుంటి శ్రీనివాసులు, వాకాటి శివ ప్రసాద్, పొదలకూరు-3 నుండి అంజాద్ షేక్, పొదలకూరు-4 నుండి పంతగిరి రమణమ్మ, అనమ్మ బూదురు, దుగ్గుంట నుండి పోలయ్య బండి, మరుపూరు నుండి కావేరి బిరదవోలు, అమ్మవారిపాళెం నుండి కర్నాటి ప్రతాప్, పిల్లిపాక పెంచలయ్య, కొవ్వూరు మాల్యాద్రి, మహమ్మదాపురం నుండి సుజాత మేకల, తోడేరు నుండి పాటి సురేష్, అట్ట వెంకటేశ్వర్లు, ఇనుకుర్తి నుండి అక్కెం లక్ష్మీ నారాయణమ్మ, ప్రసన్న మాలపాటి, బత్తులపల్లి నుండి ఆనంద రెడ్డి కోడూరు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Akshara Darshini.
PDF Share Save