Akshara Darshini
Date of Publish : 26/10/2026, 9:13 pm
Published by hameed

అధ్వానంగా రహదారులు.. పట్టించుకోని అధికారులు!

 కలువాయి మండలం లో ఆర్ అండ్ బి రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి అడుగు అడుగు కు గుంతలు ఏర్పడి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు, పర్యాటకకేంద్రమైన సోమశిలకు, కలువాయి నుండి వెళ్లాలంటే 12 కిలోమీటర్లు దూరానికి గంటసేపు ప్రయాణించాల్సిన పరిస్థితి, ఆశ్రమం సమీపంలో కల్వర్టు కూలిపోయి రెండు సంవత్సరాలు గడుస్తున్నా నేటికీ కార్యరూపం దాల్చని పరిస్థితి,కలువాయి సారవ బ్రిడ్జి పై కాంక్రిట్ లేచి పోయి ఇనుప కమ్ములు బయటపడటంతో ప్రయాణికులు ప్రాణాలు అరచేతిలో పట్టుకొని ప్రయాణించాల్సిన పరిస్థితి,రోడ్లు ఇంత అద్వానంగా వున్న ఆర్ అండ్ బి అధికారులు ఆ వైపు కన్నెత్తి చూడకపోవడం గమనార్హం, గత పది రోజులనుండి వర్షాలు పడుతుండటంతో రోడ్లు అద్వానంగా తయారయ్యాయి, ఆర్ అండ్ బి అధికారులు ఇకనైనా రోడ్ల పైన వున్న గుంతలు పూడ్చి మా ప్రాణాలు కాపాడాలని ప్రయాణికులు కోరుతున్నారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Akshara Darshini.
PDF Share Save