Akshara Darshini
Date of Publish : 26/10/2026, 9:34 pm
Published by sulthan

చేజర్లలో పోలీసుల కార్డెన్ సెర్చ్

  • ఎన్నికల నేపథ్యంలో చేజర్లలో సీఐ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో కవాతు

ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు చేజర్లలో రాత్రి కవాతు నిర్వహించారు. సంగం సర్కిల్ సీఐ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో చేజర్ల ఎస్‌ఐ అయ్యప్ప, ఎస్‌ఐ జిలానీ, సంగం ఎస్‌ఐ నాయక్‌తో పాటు సిబ్బంది పాల్గొన్నారు. ప్రధాన రహదారులు, జనసంచారం అధికంగా ఉండే ప్రాంతాల్లో పర్యటించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ముందస్తు చర్యలు చేపట్టారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉంటూ శాంతిభద్రతలను పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు పోలీసులకు సహకరించి, శాంతియుత వాతావరణాన్ని కాపాడాలని సూచించారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Akshara Darshini.
PDF Share Save