Akshara Darshini
Date of Publish : 27/10/2026, 12:19 pm
Published by shafi

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి.

  • కన్నీరు మున్నీరు అవుతున్న కుటుంబ సభ్యులు

• నెల్లూరు జిల్లా కలువాయి గ్రామానికి చెందిన గుంజి చందు (22) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఏసీ టెక్నీషియన్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్న చందు.. ఏసీకి సంబంధించిన వస్తువుల కొనుగోలు కోసం సోమవారం సాయంత్రం నెల్లూరుకు వెళ్లాడు. అక్కడి నుంచి తిరిగి వస్తుండగా రాత్రి తోపుగుంట సమీపంలో అతను ప్రయాణిస్తున్న బైక్ అదుపుతప్పి బోల్తా పడినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో చందు మృతి చెందాడు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా, అప్పటికే చందు మృతి చెందినట్లు గుర్తించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చందు బైక్ అదుపుతప్పి పడిపోవడం వల్లే మృతి చెందాడా? లేక గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడం వల్ల ప్రమాదం జరిగిందా? అనే కోణాల్లో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ప్రమాదానికి గల అసలు కారణాలు దర్యాప్తులో తేలాల్సి ఉంది. మరోవైపు, యువకుడి మృతి వార్త తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. చిన్న వయసులోనే చందు మృతి చెందడంతో కలువాయి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Akshara Darshini.
PDF Share Save