Akshara Darshini
Date of Publish : 27/10/2026, 12:19 pm
Published by Kadiyala Chinmaya Reddy

టీడీపీ జడ్పీటీసీ అభ్యర్థులకు బీ-ఫారాలు అందజేత

  • అభ్యర్థులతో ప్రమాణం చేయించిన జిల్లా అధ్యక్షుడు బీదా రవిచంద్ర

నెల్లూరు,(అక్షర దర్శిని): 

నెల్లూరులోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో జడ్పీటీసీ అభ్యర్థులకు పార్టీ జిల్లా అధ్యక్షుడు బీదా రవిచంద్ర బీ-ఫారాలను అందజేశారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ సభ్యులతో ఆయన ప్రమాణం చేయించారు.

ఈ కార్యక్రమంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులకు బీ-ఫారాలు అందజేయడంతో పాటు, ఎన్నికల్లో అనుసరించాల్సిన విధానాలు, పార్టీ అభ్యర్థుల బాధ్యతలపై నాయకులు దిశానిర్దేశం చేసినట్లు సమాచారం.

కార్యక్రమంలో టీడీపీ నాయకులు, జడ్పీటీసీ అభ్యర్థులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Akshara Darshini.
PDF Share Save