Akshara Darshini
Date of Publish : 27/10/2026, 2:38 pm
Published by Kadiyala Chinmaya Reddy

పొదలకూరులో టీడీపీ ఎన్నికల ప్రచార హోరు.

  • బిట్‌–3, బిట్‌–4 ఎంపీటీసీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి..
  • ఏసీ కాలనీ, రాపూరు రోడ్డులో విస్తృతంగా ప్రచారం

పొదలకూరు,(అక్షర దర్శిని): 

పొదలకూరు పట్టణంలో తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తోంది. ఇందులో భాగంగా మంగళవారం ఏసీ కాలనీ, రాపూరు రోడ్డులో పొదలకూరు బిట్‌–3, బిట్‌–4 ఎంపీటీసీ స్థానాల నుంచి పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్థులు షేక్‌ ఖాదర్‌ భాష, తాటి బోయిన రమణమ్మలతో కలిసి పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఆశీస్సులతో బరిలో ఉన్న తమకు సైకిల్‌ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థులు ప్రజలను కోరారు.

స్థానిక సమస్యల పరిష్కారమే లక్ష్యం

టీడీపీ అభ్యర్థులను గెలిపిస్తే ప్రజలకు అందుబాటులో ఉంటూ స్థానిక సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని ప్రచారంలో పేర్కొన్నారు. పొదలకూరు మండల అభివృద్ధిలో తెలుగుదేశం పార్టీ కీలక పాత్ర పోషించిందని పార్టీ నాయకులు తెలిపారు. పట్టణ సుందరీకరణలో భాగంగా సుమారు రూ.2 కోట్ల వ్యయంతో సెంట్రల్‌ లైటింగ్‌ ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు.

అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యం

కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమంతో పాటు విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యమిస్తోందని టీడీపీ నాయకులు పేర్కొన్నారు. మండల పరిషత్ లో గత 15 ఏళ్లుగా పాలన వెలగబెట్టిన ప్రబుద్ధులు వ్యవస్థలను భ్రష్టు పట్టించారని ఆరోపించారు. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడం, స్థానిక సమస్యలను పరిష్కరించడం తమ ప్రధాన లక్ష్యమని ప్రచారంలో వివరించారు.

ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ కొంగి మస్తానమ్మ, టీడీపీ నాయకులు కొంగి వెంకట రమణయ్య, బోగోలు భాస్కర్‌రెడ్డి, దార్ల ఆశీర్వాదం, గుర్రం మీరా మధుతో పాటు స్థానిక ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బిట్‌–3, బిట్‌–4 ఎంపీటీసీ స్థానాల్లో తమ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని వారు ఓటర్లను కోరారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Akshara Darshini.
PDF Share Save