Akshara Darshini
Date of Publish : 27/10/2026, 6:54 pm
Published by Kadiyala Chinmaya Reddy

అభివృద్ధిని ఆదరించండి.. టీడీపీని గెలిపించండి!

  • అంకుపల్లి గ్రామస్థులతో మమేకమైన టీడీపీ అభ్యర్థులు..
  • జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా విస్తృత ప్రచారం

పొదలకూరు,(అక్షర దర్శిని): 

అభివృద్ధిని ఆదరించి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించాలని టీడీపీ మండల అధ్యక్షుడు, పీఏసీఎస్‌ చైర్మన్‌ తలచీరు మస్తాన్‌బాబు పిలుపునిచ్చారు. పొదలకూరు మండలం అంకుపల్లి గ్రామంలో మంగళవారం సాయంత్రం జడ్పీటీసీ అభ్యర్థి కలిచేటి ప్రభాకర్‌రెడ్డి, ఆర్‌.వై.పాలెం ఎంపీటీసీ అభ్యర్థి మైలా కోటేశ్వరరావు పార్టీ నాయకులతో కలిసి విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా మస్తాన్‌బాబు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వ పాలనలో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ఆదరించాలని కోరారు. సాగునీరు, తాగునీరు, మౌలిక సదుపాయాల కల్పనలో సోమిరెడ్డి కృషి చేశారని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో సైకిల్‌ గుర్తుపై ఓటు వేసి టీడీపీ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

ఇంటింటికీ వెళ్లి మద్దతు కోరిన అభ్యర్థులు

జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులు గ్రామంలోని ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరించారు. గ్రామంతోపాటు ఎస్సీ కాలనీలోనూ పర్యటించి ఓటర్లతో మమేకమయ్యారు. కూటమి అభ్యర్థులకు మద్దతు తెలిపి గెలిపించాలని కోరుతూ ఎన్నికల కరపత్రాలను పంపిణీ చేశారు. ప్రచార సమయంలో గ్రామస్థులు అభ్యర్థులకు స్వాగతం పలికారు.

ఈ కార్యక్రమంలో సీనియర్‌ నాయకుడు పులిపాటి వెంకటరత్న నాయుడు, సర్వేపల్లి జనసేన నాయకుడు నారదాసు రవి, కోడూరు పెంచల భాస్కర్‌రెడ్డి, పెంచల నాయుడు, ఆవులపాటి పిచ్చినాయుడు, నాగినేని పెంచల సుబ్బానాయుడు, నాగినేని ప్రభాకర్‌నాయుడు, కొప్పాల రాఘవులు, మోహన్‌, గూడపాటి కృష్ణమూర్తి, వేంకటరమణయ్య, అత్తెన శ్రీనివాసులు, అడసనపల్లి పెంచలయ్య, యాదాల కోటి, రాపూరు రత్నం, పంతగిరి పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Akshara Darshini.
PDF Share Save