Akshara Darshini
Date of Publish : 27/10/2026, 8:30 pm
Published by sulthan

వావిలేరు ఎంపీటీసీగా గోనుగుంట సుశీల ఏకగ్రీవ ఎన్నిక

  • టిడిపి నాయకుల హర్షం

చేజర్ల మండలం వావిలేరు సెగ్మెంట్ ఎంపీటీసీ అభ్యర్థి గోనుగుంట సుశీల ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రత్యేక అధికారి బొడ్డు ప్రసాద్ బాబు ఆమెకు ఎన్నికైనట్లు ధ్రువీకరిస్తూ డిక్లరేషన్ అందజేశారు. పోటీలో ఇతర అభ్యర్థులు లేకపోవడంతో సుశీల ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమెకు పలువురు నాయకులు, పార్టీ శ్రేణులు అభినందనలు తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామ అభివృద్ధికి కృషి చేయాలని స్థానికులు ఆకాంక్షించారు. ఏకగ్రీవ ఎన్నికతో వావిలేరు సెగ్మెంట్‌లో టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Akshara Darshini.
PDF Share Save