నెల్లూరు జిల్లా కలువాయి మండలం కుల్లూరు జనసేన ఎంపీటీసీ అభ్యర్థి మాలే రామారావు వెంకటరెడ్డిపల్లి గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతోందని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా పయనిస్తోందని కొనియాడారు. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనకు అప్పగించిన శాఖల్లో వినూత్న విధానాలతో ప్రజలకు మెరుగైన సేవలు అందించే దిశగా కృషి చేస్తున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్ర ప్రగతికి దోహదపడుతున్నాయని ఆయన అన్నారు.
రానున్న ఎన్నికల్లో కూటమి బలపరిచిన ఎంపీటీసీ అభ్యర్థిగా తనకు గాజు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని, అలాగే జడ్పీటీసీ అభ్యర్థిని సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని మాలే రామారావు ఓటర్లను అభ్యర్థించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని, కూటమి అభ్యర్థులను గెలిపించడం ద్వారా అభివృద్ధి కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్లవచ్చని ప్రజలకు వివరించారు. ఈ ఇంటింటి ప్రచార కార్యక్రమంలో మాజీ మండల జనసేన పార్టీ అధ్యక్షుడు మనోహర్, గ్రామ నాయకులు సుదర్శన్, హరిప్రసాద్, టీడీపీ నాయకులు రాజేష్, రవి, బీజేపీ నాయకుడు చిన్న తదితరులు పాల్గొన్నారు.

