Akshara Darshini
Date of Publish : 28/10/2026, 12:20 pm
Published by sulthan

కోటితీర్థం శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన టిడిపి నాయకులు తాళ్లూరు గిరినాయుడు

  • చేజర్ల మండలంలోని ఎంపీటీసీ సభ్యులు, టిడిపి నాయకులతో ప్రత్యేక పూజలు నిర్వహణ
  • అనంతరం ఎన్నికల ప్రచారం నిర్వహించిన తాళ్లూరి గిరినాయుడు
  • జడ్పిటిసి అభ్యర్థికి ఓట్లు వేసి గెలిపించాలని కోరిన తాళ్లూరు గిరినాయుడు

చేజర్ల: మండలంలోని కోటితీర్థం శివాలయంలో ఆత్మకూరు నియోజకవర్గ టీడీపీ సీనియర్ నాయకుడు తాళ్లూరు గిరినాయుడు, చేజర్ల మండలానికి చెందిన తొమ్మిది మంది ఎంపీటీసీలు, మండల టీడీపీ నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామంలో ఎన్నికల ప్రచారం చేపట్టారు. జడ్పీటీసీ అభ్యర్థి రావి మల్లీశ్వరికి తెలుగుదేశం పార్టీ గుర్తు సైకిల్‌పై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు.ఈ సందర్భంగా తాళ్లూరు గిరినాయుడు మీడియాతో మాట్లాడుతూ దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆత్మకూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని అన్నారు. మంత్రి చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసే చేజర్ల మండలంలో పది ఎంపీటీసీ స్థానాలకు గాను తొమ్మిది స్థానాలు ఏకగ్రీవమయ్యాయని పేర్కొన్నారు. ఆత్మకూరు నియోజకవర్గవ్యాప్తంగా కూడా అనేక ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం కావడం ప్రభుత్వ అభివృద్ధికి నిదర్శనమని అన్నారు.

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రత్యర్థులకు నామినేషన్లు వేసే అవకాశం కూడా కల్పించలేదని విమర్శించారు. ప్రస్తుతం వైఎస్‌ జగన్‌ తమ పార్టీ అభ్యర్థులు గెలవకపోతే దాడులకు పాల్పడాలని కార్యకర్తలను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో చేజర్ల మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Akshara Darshini.
PDF Share Save