Akshara Darshini
Date of Publish : 29/10/2026, 5:38 pm
Published by hameed

ప్రజల ఆశీస్సులతో విజయకేతనం ఎగురవేస్తాం

పొదలకూరు, అక్షరదర్శిని: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పొదలకూరు మండలంలో వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. బిట్‌–1 ఎంపీటీసీ అభ్యర్థి గంగవరపు లక్ష్మి కళ్యాణి, బిట్‌–2 అభ్యర్థి వాకాటి సంధ్య, బిట్‌–3 అభ్యర్థి కోవూరు వెంకటేశ్వర్లు, జడ్పీటీసీ అభ్యర్థి బచ్చల సురేష్‌ కుమార్‌రెడ్డి గడపగడపకూ వెళ్లి ప్రజలను కలుస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు.

ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుంటూ, స్థానిక అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తామని అభ్యర్థులు హామీ ఇస్తున్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అమలైన సంక్షేమ పథకాలు, పేదలు, రైతులు, మహిళలు, విద్యార్థులకు అందించిన ప్రయోజనాలను ప్రజలకు వివరిస్తూ మద్దతు కోరుతున్నారు.సర్వేపల్లి నియోజకవర్గంలో మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ కాకాణి గోవర్ధన్‌రెడ్డి నాయకత్వంపై తమకు పూర్తి విశ్వాసం ఉందని అభ్యర్థులు పేర్కొన్నారు. ఆయన ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలే తమకు బలమని తెలిపారు.ప్రజల ఆదరణ, కార్యకర్తల సహకారంతో బిట్‌–1, బిట్‌–2, బిట్‌–3 ఎంపీటీసీ స్థానాలతో పాటు జడ్పీటీసీ స్థానంలోనూ విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రచారంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Akshara Darshini.
PDF Share Save