నెల్లూరు జిల్లా కలువాయి మండలంలో టీడీపీ జడ్పీటీసీ అభ్యర్థి అరవ లిఖిత ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతి గ్రామంలో పర్యటిస్తూ మద్దతు కోరుతున్నారు. ఈ క్రమంలో గురువారం కుల్లూరు గ్రామంలో మాజీ ఎమ్మెల్సీ మాదాసు గంగాధరం దంపతులను మర్యాదపూర్వకంగా కలుసుకుని రానున్న జడ్పీటీసీ ఎన్నికల్లో తనకు మద్దతు అందించాలని కోరారు. దీనికి స్పందించిన మాదాసు గంగాధరం దంపతులు అరవ లిఖితకు సంపూర్ణ మద్దతు ప్రకటించడంతో పాటు తమ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని తెలిపారు. కుల్లూరు పంచాయతీ పరిధిలోని కుల్లూరు, మజరా గ్రామాలైన వెంకటరెడ్డిపల్లి, రాజుపాలెం గ్రామాల్లో కలిపి సుమారు 4,600 మంది ఓటర్లు ఉన్నారని, ఈ గ్రామాల ప్రజల ఆశీస్సులు అరవ లిఖితకు ఉంటాయని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అరవ లిఖిత భర్త డాక్టర్ రాజేష్, టీడీపీ సీనియర్ నాయకులు మల్లికార్జున యాదవ్, అల్లంపాటి వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

