Akshara Darshini
Date of Publish : 30/10/2026, 5:49 pm
Published by sulthan

మడపల్లిలో జడ్పీటీసీ అభ్యర్థి రావి మల్లేశ్వరి ఎన్నికల ప్రచారం

  • మండల వ్యాప్తంగా జోరుగా టీడీపీ జడ్పిటిసి అభ్యర్థి ఎన్నికల ప్రచారం
  • గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్న టీడీపీ నాయకులు

చేజర్ల: మండలంలోని మడపల్లి గ్రామంలో ఎన్డీఏ కూటమి జడ్పీటీసీ అభ్యర్థి రావి మల్లేశ్వరి శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి సైకిల్ గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఆత్మకూరు నియోజకవర్గ టీడీపీ సీనియర్ నాయకులు, కిమ్స్ హాస్పిటల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తాళ్లూరు గిరినాయుడు ఆశీస్సులతో పాటు మాజీ ఎంపీపీ రావి పెంచలరెడ్డి, మాజీ సర్పంచ్ రావి లక్ష్మీనరసారెడ్డి, మండల టీడీపీ అధ్యక్షుడు షేక్ సిరాజుద్దీన్, మండల సొసైటీ అధ్యక్షుడు బూదల్ల వీరరాఘవరెడ్డి తదితర కూటమి నాయకుల మద్దతుతో ఆమె ప్రచారం చేపట్టారు.

ఈ కార్యక్రమంలో మడపల్లి ఎంపీటీసీ కొండా సుధాకర్ రెడ్డి, బూదల్ల విజయమ్మ, సోమవరపు హాజరత్తయ్య, జువ్విగుంట బాబు, జువ్విగుంట బుజ్జమ్మ, వంగవరుగు దామోదర్ రెడ్డి, అరవ రామిరెడ్డి, రావి హజరత్ రెడ్డి, నెల్లూరు జనార్దన్ రెడ్డి, పూనూరు మాధవరెడ్డి, రావి కృష్ణారెడ్డి, అరవ గోపిరెడ్డి, తెలుగు మహిళా నాయకురాళ్లు గుండాల భాగ్యలక్ష్మి, కొండా సుగుణమ్మ, అరవ లక్ష్మీప్రసన్న, కంచి శిరీష, ఆవుల వెంకటకృష్ణ తదితర టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Akshara Darshini.
PDF Share Save