Akshara Darshini
Date of Publish : 30/10/2026, 6:42 pm
Published by shafi

ఏపీఎన్‌విఎఫ్ నెల్లూరు జిల్లా నూతన కార్యవర్గం ఎంపిక.

నెల్లూరు జిల్లా ఏపీఎన్‌విఎఫ్ ఎస్‌పీఎస్‌ఆర్ నెల్లూరు జిల్లా సమావేశం శుక్రవారం (30-10-2026) నిర్వహించారు. ఈ సమావేశంలో సంఘం బలోపేతం, ఉద్యోగుల సమస్యలు, భవిష్యత్తు కార్యాచరణపై ప్రధానంగా చర్చించారు. నెల్లూరు వీఏ అసోసియేషన్‌కు కో-ఆప్షన్ ద్వారా ప్రతినిధి ఎంపిక, 2027 సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్ రూపకల్పన, వివిధ శాఖల్లో ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంపై చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎంపిక చేశారు. అధ్యక్షురాలిగా జి.వి. సునీత, అసోసియేట్ అధ్యక్షుడిగా ఎస్.కె. జలీల్ బాషా, ఉపాధ్యక్షులుగా ఎన్. ఓబయ్య, బి. వీరాంజనేయులు, ఐ. జగదీష్, కార్యదర్శిగా డి. వెంకటేష్, సంయుక్త కార్యదర్శులుగా వై. అతిలకాంత్, ఎ. ప్రియాంక, కోశాధికారిగా ఎస్.కె. జమీర్ బాషాలను ఎంపిక చేశారు. అలాగే కార్యవర్గ సభ్యులుగా జి. ఓబయ్య, ఎస్.డి. రఫీ, యు. మల్లికార్జున, ఎన్. మహేశ్వరి, సి.హెచ్. వెంకటేష్‌లను ఎంపిక చేశారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఐక్యంగా కృషి చేస్తూ, సంఘాన్ని మరింత బలోపేతం చేయాలని ఈ సందర్భంగా నిర్ణయించార

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Akshara Darshini.
PDF Share Save