కేంద్ర రక్షణ, విద్యాశాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన వీర్ గాథ 6.0 కార్యక్రమంలో చేజర్ల మండలం ఆదురుపల్లి మోడల్ ప్రైమరీ స్కూల్ విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. పఠాన్ ఫాయిజా, చీర్ల రీతు, షేక్ మెహరూన్, చలంచర్ల మేరీ స్వాతంత్ర్య సమరయోధుల గురించి చక్కటి వ్యాసాలు రాయడంతో ప్రశంసా పత్రాలు అందుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల హెచ్‌ఎం గీత, ఉపాధ్యాయులు సుబ్రమణ్యం, శ్రీరాములు, రమాభవాని, విజయలలిత విద్యార్థులను అభినందించారు.