Akshara Darshini
Date of Publish : 31/10/2026, 12:21 pm
Published by shafi

తెలుగురాయపురంలో టీడీపీ అభ్యర్థి విస్తృత ప్రచారం..

నెల్లూరు జిల్లా కలువాయి మండలం తెలుగురాయపురం గ్రామంలో టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి కోలా శివజ్యోతిర్మయి ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ, రానున్న స్థానిక ఎన్నికల్లో తనకు మద్దతు తెలిపి ఎంపీటీసీగా గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలుతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్న కూటమి ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలవాలని, స్థానిక ఎన్నికల్లో తనకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో టీడీపీ నాయకులు రామ్ నారాయణ రెడ్డి, బతుల నారాయణ రెడ్డి, విజయ,శేఖర్, సాయి,రమణ, చిన్న మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Akshara Darshini.
PDF Share Save