చేజర్ల మండలం ఆదురుపల్లి గ్రామంలో శనివారం మధ్యాహ్నం పిడుగుపాటు చోటుచేసుకుంది. మధ్యాహ్నం సుమారు 3:30 గంటల సమయంలో స్వీట్ షాప్ గోడౌన్‌పై పిడుగు పడటంతో అక్కడి కుకింగ్ చిమ్నీ పగిలిపోయింది. ఈ ఘటనతో స్వీట్ షాప్ యజమానికి ఆస్తి నష్టం వాటిల్లింది. అయితే అదృష్టవశాత్తు ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. పిడుగు పడిన సమయంలో భారీ శబ్దం రావడంతో గ్రామంలోని చుట్టుపక్కల ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఏం జరిగిందో తెలియక కొద్దిసేపు భయాందోళనకు గురయ్యారు. మరోవైపు అదే సమయంలో గ్రామంలో వర్షం కురుస్తుండటంతో పిడుగుపాటు ఘటన స్థానికంగా కలకలం రేపింది. వర్షం పడుతున్న సమయంలో ప్రజలు చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని స్థానికులు సూచిస్తున్నారు. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు