Akshara Darshini
Date of Publish : 01/11/2026, 5:59 am
Published by Kadiyala Chinmaya Reddy

రాపూరు బిట్‌-2లో వైసీపీ అభ్యర్థి మేరీగ సుమతికి మద్దతుగా ఓటర్ల విస్తృత ప్రచారం

  • ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి

రాపూరు,(అక్షర దర్శిని):

నెల్లూరు జిల్లా రాపూరు మండలం బిట్‌-2 ఎంపీటీసీ ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మేరీగ సుమతికి మద్దతుగా రెండో సెగ్మెంట్ పరిధిలోని ఓటర్లు పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఫ్యాన్ గుర్తుపై తమ అమూల్యమైన ఓటు వేసి మేరీగ సుమతిని అఖండ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.

ఈ ప్రచార కార్యక్రమంలో డాక్టర్ మేరీగ రేవంత్ చక్రవర్తితో పాటు పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అభ్యర్థి విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్లి విస్తృతంగా ప్రచారం చేపట్టారు.

రాపూరు బిట్‌-2లో వైసీపీ అభ్యర్థికి మద్దతుగా సాగిన ఈ ప్రచార కార్యక్రమంతో ఎన్నికల వాతావరణం మరింత వేడెక్కింది.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Akshara Darshini.
PDF Share Save