Akshara Darshini
Date of Publish : 01/11/2026, 9:50 am
Published by Kadiyala Chinmaya Reddy

సామాన్య ఓటర్లతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే కోటంరెడ్డి

నెల్లూరు రూరల్,(అక్షర దర్శిని): 

నెల్లూరు రూరల్ పరిధిలోని మాగుంట లేఔట్‌లో ఉన్న ఎస్‌ఆర్‌కే స్కూల్‌ పోలింగ్‌ కేంద్రంలో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి సామాన్య ఓటర్లతో కలిసి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైనదని చాటుతూ ఆయన పోలింగ్‌ కేంద్రానికి చేరుకుని ఓటు వేశారు.సామాన్య ఓటర్లతో కలిసి ఓటు వేయడం ద్వారా ప్రజాస్వామ్య ప్రక్రియలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలనే సందేశాన్ని ఇచ్చారు. ఓటర్లు తమ ఓటు హక్కును బాధ్యతగా వినియోగించుకోవడం ద్వారా ప్రజాస్వామ్య వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని ఈ సందర్భంగా ప్రాధాన్యం సంతరించుకుంది.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Akshara Darshini.
PDF Share Save