Akshara Darshini
Date of Publish : 01/11/2026, 11:20 am
Published by Kadiyala Chinmaya Reddy

బైక్‌పై పర్యటిస్తూ పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్ హిమాన్షు శుక్లా

నెల్లూరు,(అక్షర దర్శిని): 

నెల్లూరు నగరంలో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హిమాన్షు శుక్లా మోటార్ బైక్‌పై పర్యటిస్తూ వివిధ పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలింగ్ సరళిని పరిశీలించారు. ఇందులో భాగంగా మూలాపేటలోని డీఎస్ఆర్ హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి ఓటింగ్ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా పోలింగ్ నిర్వహణ తీరును, ఓటర్లకు కల్పించిన సౌకర్యాలను కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. పోలింగ్ ప్రక్రియకు సంబంధించిన వివరాలను సమీక్షించారు. ఎన్నికలు సజావుగా సాగుతున్న తీరును పరిశీలిస్తూ పోలింగ్ కేంద్రాల్లోని ఏర్పాట్లపై ఆరా తీశారు. నగరంలో మోటార్ బైక్‌పై పర్యటిస్తూ పోలింగ్ కేంద్రాలను స్వయంగా సందర్శించడం ద్వారా ఎన్నికల నిర్వహణపై అధికారుల దృష్టిని మరింత కేంద్రీకరించారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Akshara Darshini.
PDF Share Save