Akshara Darshini
Date of Publish : 01/11/2026, 11:26 am
Published by Kadiyala Chinmaya Reddy

అమరజీవి పొట్టి శ్రీరాములుకు ఘన నివాళులు

పొదలకూరు(అక్షర దర్శిని):

ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని పొదలకూరు స్థానిక బస్టాండ్ సెంటర్‌లో అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి ఆర్యవైశ్య నాయకులు, పెద్దలు, ఆయన అభిమానులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం పొట్టి శ్రీరాములు చేసిన మహోన్నత త్యాగాన్ని, ఆమరణ నిరాహార దీక్షను, తెలుగు ప్రజల ఆకాంక్షల సాధన కోసం ఆయన చేసిన పోరాటాన్ని స్మరించుకున్నారు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు త్యాగం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని పేర్కొన్నారు.

ఆయన పట్టుదల, నిబద్ధత, పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శమని కొనియాడారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు ఆయన చేసిన కృషి భారతదేశ చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుందని తెలిపారు. అమరజీవి ఆశయాలను భావితరాలకు అందిస్తూ, ఆయన త్యాగస్ఫూర్తిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య నాయకులు, పెద్దలు, పొట్టి శ్రీరాములు అభిమానులు పాల్గొని అమరజీవికి ఘన నివాళులర్పించారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Akshara Darshini.
PDF Share Save