Akshara Darshini
Date of Publish : 01/11/2026, 7:55 pm
Published by sulthan

పాతపాడు, ఓబులయపల్లిలో జడ్పీటీసీ అభ్యర్థి రావి మల్లేశ్వరి ఇంటింటి ప్రచారం

  • సైకిల్ గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో తనను గెలిపించాలని ఓటర్లను కోరిన రావి మల్లీశ్వరి
  • చేజర్ల మండలంలో జోరుగా ఎన్నికల ప్రచారం

చేజర్ల మండలం పాతపాడు, ఓబులయపల్లి గ్రామాల్లో ఆదివారం ఎన్డీఏ కూటమి జడ్పీటీసీ అభ్యర్థి రావి మల్లేశ్వరి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఆత్మకూరు నియోజకవర్గ టీడీపీ సీనియర్ నాయకులు, కిమ్స్ హాస్పిటల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తాళ్లూరు గిరినాయుడు ఆశీస్సులతో మండల కూటమి నాయకుల మద్దతుతో ఆమె ప్రచారం చేపట్టారు. ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలుసుకుని సైకిల్ గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని అభ్యర్థించారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు షేక్ సిరాజుద్దీన్, మాజీ ఎంపీపీ రావి పెంచలరెడ్డి, మండల సొసైటీ అధ్యక్షుడు బూదళ్ల వీరరాఘవరెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు డొంకల చెంచు నరసింహరావు, క్లస్టర్ ఇన్‌చార్జులు నలబోతు శివకృష్ణ చౌదరి, రావి కృష్ణారెడ్డి, సీనియర్ నాయకులు ఉడతా హాజరతయ్య, అల్లంపాటి పెంచలరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అలాగే పలువురు మాజీ సర్పంచులు, టీడీపీ నాయకులు, తెలుగు మహిళా నాయకురాళ్లు, యువత, కార్యకర్తలు ప్రచారంలో పాల్గొన్నారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Akshara Darshini.
PDF Share Save