Akshara Darshini
Date of Publish : 01/11/2026, 7:55 pm
Published by sulthan

మాముడూరులో జడ్పీటీసీ అభ్యర్థి రావి మల్లేశ్వరి ఇంటింటి ప్రచారం

  • చేజర్ల మండల వ్యాప్తంగా జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న కూటమి నాయకులు

చేజర్ల మండలం మాముడూరు గ్రామంలో ఆదివారం ఎన్డీఏ కూటమి జడ్పీటీసీ అభ్యర్థి రావి మల్లేశ్వరి ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఆత్మకూరు నియోజకవర్గ టీడీపీ సీనియర్ నాయకులు, కిమ్స్ హాస్పిటల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తాళ్లూరు గిరినాయుడు ఆశీస్సులతో మండల కూటమి నాయకుల మద్దతుతో ఆమె ప్రచారం చేపట్టారు.ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలుసుకుని సైకిల్ గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని అభ్యర్థించారు.ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు షేక్ సిరాజుద్దీన్,మాజీ ఎంపీపీలు అన్నలూరు శ్రీనివాసులు నాయుడు, రావి పెంచలరెడ్డి, మండల సొసైటీ అధ్యక్షుడు బూదళ్ల వీరరాఘవరెడ్డి, కొమ్మి రమేష్ నాయుడు, రావి లక్ష్మీనరసారెడ్డి, సోమశిల 24 ఎల్ కాలువ అధ్యక్షులు ఉడత హజరతయ్య,మాజీ సర్పంచులు బూదళ్ల విజయమ్మ, అరెద్దుల రామకృష్ణయ్య, షేక్ మస్తాన్, కొమ్మి తిరుపతి నాయుడు తదితరులు పాల్గొన్నారు. అలాగే పలువురు టీడీపీ నాయకులు, చెరువుల చైర్మన్లు, తెలుగు మహిళా నాయకురాళ్లు, తెలుగుయువత, ఎస్టీ సెల్ నాయకులు, గ్రామ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నా

రు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Akshara Darshini.
PDF Share Save