తాను ప్రస్తుతం ఏ రాజకీయ పార్టీలో లేకపోయినా, కలువాయి మండలంలో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులకు తన సంపూర్ణ మద్దతు ఉంటుందని మాజీ ఎమ్మెల్సీ మాదాసు గంగాధరం ప్రకటించారు. ఆదివారం రాత్రి కలువాయి మండలం కుల్లూరులోని తన స్వగృహంలో మండలంలోని తన ఆత్మీయులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విందు భోజనాలు ఏర్పాటు చేసి, అనంతరం వారితో రాజకీయ పరిస్థితులు, ఎన్నికలపై చర్చించారు.ఈ సందర్భంగా మాదాసు గంగాధరం మాట్లాడుతూ జడ్పీటీసీ అభ్యర్థి ఆరవ లిఖిత, కలువాయి ఎంపీటీసీ సెగ్మెంట్-1 అభ్యర్థి చల్లా రఘురామిరెడ్డి విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. మండలంలోని టీడీపీ అభ్యర్థులకు తన సంపూర్ణ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. అలాగే కలువాయిలోని బలిజ సామాజిక వర్గానికి చెందిన ప్రజలంతా ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు.నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, పొంగూరు నారాయణ, జిల్లా టీడీపీ అధ్యక్షుడు బీద రవిచంద్ర, జిల్లాలోని ఎమ్మెల్యేల సహకారంతో జిల్లా పరిషత్ చైర్మన్ స్థానాన్ని టీడీపీ కైవసం చేసుకుంటుందని మాదాసు గంగాధరం ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ అభ్యర్థి ఆరవ లిఖిత మాజీ ఎమ్మెల్సీ మాదాసు గంగాధరం, నలినమ్మ దంపతుల ఆశీర్వాదం తీసుకున్నారు.
ఈ సమావేశంలో టీడీపీ మండల సీనియర్ నాయకులు అల్లంపాటి వేణుగోపాల్ రెడ్డి, అరిబోయిన మల్లికార్జున యాదవ్, డాక్టర్ రాజేష్, పిడుగు కొండారెడ్డి, కలువాయి బలిజ సంఘం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

