రాపూరు,అక్షర దర్శిని):
నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ యువజన విభాగ అధ్యక్షులు డాక్టర్ మెరిగ రేవంత్ చక్రవర్తి మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.పులివెందులలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రానికి వెళ్లగా, ఆయన ఓటు వేయకుండా అనేక విధాలుగా అడ్డంకులు సృష్టించారని ఆరోపించారు. అంతేకాకుండా సుమారు 70 పోలింగ్ కేంద్రాల్లో వైఎస్ఆర్సీపీ ఏజెంట్లను అనుమతించకుండా అడ్డుకున్నారని, టీడీపీ ఏజెంట్లు దొంగ ఓట్లు వేసినట్లు ఆరోపించారు.రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని, బ్రిటిష్ పాలనను తలపించే విధంగా రాష్ట్రంలో పరిస్థితులు ఉన్నాయని ఆయన విమర్శించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి పరిణామాలు ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కూటమి పార్టీ పాలనలో అరాచక పరిస్థితులు నెలకొన్నాయని డాక్టర్ మెరిగ రేవంత్ చక్రవర్తి ఆరోపించారు.