మురాసు తుఫాను ప్రభావంతో నెల్లూరు జిల్లాలో భారీ గాలులు, వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో చేజర్ల మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై అయ్యప్ప సూచించారు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని, బీచ్‌లు, వాగులు, వంకల వద్దకు వెళ్లకూడదని తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ప్రమాదకర నిర్మాణాలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. విద్యుత్ స్తంభాలు, తీగలను తాకవద్దని, గర్భిణులు, చిన్నారులు, వృద్ధుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు. అత్యవసర పరిస్థితుల్లో 112కు కాల్ చేయాలని సూచించారు.