Akshara Darshini
Date of Publish : 02/11/2026, 5:58 pm
Published by sulthan

చేజర్లలో టీడీపీ అభ్యర్థుల గెలుపునకు మంత్రి ఆనం పిలుపు

  • తూర్పుపల్లి నుంచి వైసీపీ నుంచి టిడిపిలో చేరిన పది కుటుంబాలు
  • పార్టీ కండువా కప్పి టిడిపిలోకి ఆహ్వానించిన మంత్రి ఆనం
  • భారీ మెజారిటీతో జడ్పిటిసి ఎంపిటిసి అభ్యర్థులను గెలిపించాలని కోరిన మంత్రి ఆనం

చేజర్ల మండలంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పర్యటించారు. టీడీపీలో చేరిన అనంతరం మాజీ ఎంపీపీ తూమాటి విజయ్ భాస్కర్ రెడ్డి ఇంటికి తొలిసారి వెళ్లి పరామర్శించారు. అనంతరం మాజీ సర్పంచ్ రావి లక్ష్మీ నర్సారెడ్డి నివాసంలో ఏకగ్రీవమైన 9 మంది ఎంపీటీసీలు, ఎంపీటీసీ అభ్యర్థి రాంపాటి అంకమ్మ, జడ్పీటీసీ అభ్యర్థి రావి మల్లీశ్వరితో పాటు మండల నాయకులతో సమావేశమయ్యారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటి అభ్యర్థులుగా భావించి కష్టపడి పనిచేసి భారీ మెజారిటీతో గెలిపించాలని మంత్రి కోరారు. ఈ సందర్భంగా తూర్పుపల్లి గ్రామానికి చెందిన వైసీపీకి చెందిన పది కుటుంబాలు టీడీపీలో చేరగా, మంత్రి వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకుడు తాళ్లూరు గిరినాయుడు, సోమశిల ప్రాజెక్టు చైర్మన్ వేలూరు కేశవ చౌదరి, మండల అధ్యక్షుడు షేక్ సిరాజుద్దీన్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Akshara Darshini.
PDF Share Save