Akshara Darshini
Date of Publish : 02/11/2026, 5:56 pm
Published by shafi

పెన్నబద్వేల్‌లో టీడీపీ అభ్యర్థుల ఇంటింటి ప్రచారం.

  • ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, కేంద్ర సహకార సంఘం బ్యాంక్ చైర్మన్ మెట్టకూరు ధనంజయ రెడ్డి.
  • భారీగా తరలించిన టిడిపి శ్రేణులు.

నెల్లూరు జిల్లా కలువాయి మండలం పెన్నబద్వేల్ గ్రామంలో టీడీపీ జడ్పీటీసీ అభ్యర్థి అరవ లిఖిత, ఎంపీటీసీ అభ్యర్థి కోటంరెడ్డి లక్ష్మి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచార కార్యక్రమంలో వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, కేంద్ర సహకార సంఘం చైర్మన్, కలువాయి–రాపూరు మండలాల ఇంచార్జి మెట్టకూరు ధనుంజయ రెడ్డి పాల్గొని అభ్యర్థులతో కలిసి గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలను కలుసుకున్నారు. ఈ సందర్భంగా అభ్యర్థులు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో కూటమి ప్రభుత్వం గత రెండేళ్లుగా ఒకవైపు సంక్షేమ పథకాలను అమలు చేస్తూ, మరోవైపు అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తోందని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అర్హులైన లబ్ధిదారులకు రూ.4 వేల నుంచి రూ.15 వేల వరకు సామాజిక పింఛన్లు అందిస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వంలో కేవలం బటన్ నొక్కడానికే పరిమితమయ్యారని, ప్రస్తుత ప్రభుత్వం సంక్షేమ పథకాలతో పాటు గ్రామాల అభివృద్ధికి కూడా ప్రాధాన్యత ఇస్తోందని వివరించారు. గ్రామాల అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న కూటమి అభ్యర్థులకు ప్రజలు మద్దతు తెలపాలని వారు కోరారు. ప్రచార కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు చల్లా రఘురామిరెడ్డి, యువజన నాయకులు శివారెడ్డి, సీనియర్ నాయకులు వెంకటేశ్వర్లు నాయుడు, మల్లికార్జున యాదవ్, కిషోర్ రెడ్డి, బట్టిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, మల్లికార్జున నాయుడు, తేజ, రాధ కృష్ణ రెడ్డి, మహేష్ స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Akshara Darshini.
PDF Share Save