Akshara Darshini
Date of Publish : 02/11/2026, 7:48 pm
Published by shafi

విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి.

  • గ్రామంలో విషాదం.
  • విద్యుత్ స్తంభం ఎక్కి మరమ్మతులు చేస్తుండగా ప్రమాదం..*

నెల్లూరు జిల్లా కలువాయి మండలం కే.సి. గోపవరం సమీపంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. విద్యుత్ స్తంభం ఎక్కి మరమ్మతులు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై ఓ యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. వివరాల్లోకి వెళితే.. దాచూరు గ్రామానికి చెందిన బైరుపోగు గణేష్ (27) విద్యుత్ స్తంభం ఎక్కి మరమ్మతు పనులు నిర్వహిస్తుండగా ఒక్కసారిగా విద్యుత్ సరఫరా కావడంతో తీవ్ర విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. ఈ ప్రమాదంలో గణేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. చేతికి అందిన వయసులో యువకుడు మృత్యువాత పడటంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. ఘటనకు గల పూర్తి వివరాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. యువకుడి మృతితో దాచూరు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Akshara Darshini.
PDF Share Save