Akshara Darshini
Date of Publish : 03/11/2026, 7:40 pm
Published by sulthan

వావిలేరులో జడ్పిటిసి అభ్యర్థి విజయానికి ప్రచారం

  • మాజీ సర్పంచ్ రాంబాబు ఇంటింటికి వెళ్లి ఎన్నికల ప్రచారం
  • భారీ మెజారిటీతో కూటమి అభ్యర్థి రావి మల్లీశ్వరిని గెలిపించాలని ప్రచారం

చేజర్ల మండలం వావిలేరు గ్రామంలో జడ్పీటీసీ కూటమి అభ్యర్థి రావి మల్లీశ్వరి విజయాన్ని కాంక్షిస్తూ వావి లేరు మాజీ సర్పంచ్ గోనుగుంట రాంబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామంలోని పలు వీధుల్లో ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలుసుకున్నారు. రాబోయే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి కూటమి అభ్యర్థి రావి మల్లీశ్వరిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. కూటమి అభ్యర్థులకు ప్రజల మద్దతు తెలిపి విజయానికి సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లకు అభ్యర్థి తరఫున విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ప్రచారాన్ని కొనసాగించారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Akshara Darshini.
PDF Share Save