నెల్లూరు,(అక్షర దర్శిని):
నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్‌గా కూటమి అభ్యర్థి పోలుబోయిన రూప్ కుమార్ యాదవ్ భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఎన్నికల ఫలితాల్లో ఆయనకు 80,170 ఓట్ల మెజారిటీ లభించినట్లు సమాచారం. ఈ విజయంతో కూటమి శ్రేణుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి.
నగరంలో జరిగిన ఎన్నికల్లో రూప్ కుమార్ యాదవ్‌కు ప్రజల నుంచి విశేష మద్దతు లభించిందని కూటమి నాయకులు పేర్కొన్నారు. ఆయన విజయంతో నెల్లూరు నగర అభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
విజయం అనంతరం కూటమి నాయకులు, కార్యకర్తలు సంబరాలు నిర్వహిస్తూ రూప్ కుమార్ యాదవ్‌కు అభినందనలు తెలిపారు. నగర ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తానని ఆయన పేర్కొన్నట్లు తెలిపారు.