Akshara Darshini
Date of Publish : 04/11/2026, 12:32 pm
Published by sulthan

ఎన్నికల నిబంధనలు పాటించాలి.. ఎస్ఐ అయ్యప్ప

  • ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరిన ఎస్సై అయ్యప్ప

చేజర్ల మండల ప్రజలు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఎస్ఐ అయ్యప్ప సూచించారు. ఎన్నికల ప్రచార గడువు ముగియడంతో సైలెన్స్ పీరియడ్ అమల్లోకి వచ్చిందన్నారు. సభలు, ర్యాలీలు, మైకులు, ప్రచార కార్యక్రమాలు నిర్వహించరాదన్నారు. టీవీ, రేడియో, సోషల్ మీడియా ద్వారా ఎన్నికల ప్రచారం చేయకూడదని తెలిపారు. ఓటర్లు కాని బయటి వ్యక్తులు నియోజకవర్గంలో ఉండరాదని, ప్రతి ఒక్కరూ ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Akshara Darshini.
PDF Share Save