Akshara Darshini
Date of Publish : 04/11/2026, 12:31 pm
Published by shafi

కలువాయిలో ఎన్నికలకు సర్వం సిద్ధం..

  • 48 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు.. 288 మంది పోలింగ్ సిబ్బంది నియామకం.
  • ఎన్నికల బందోబస్తుకు 50 మంది పోలీసులు.. సీఐ, ఇద్దరు ఎస్ఐలు.

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గురువారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లా కలువాయి మండలంలో మొత్తం 48 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎన్నికల విధుల నిర్వహణ కోసం 288 మంది పీఓలు, ఏపీఓలు, ఓపీఓలను నియమించారు. ఈ సందర్భంగా మండల ఎన్నికల రిటర్నింగ్ అధికారి సుబ్బరాజు పోలింగ్ సిబ్బందికి విధుల కేటాయింపులు చేశారు. పోలింగ్ సామగ్రి తరలింపుతో పాటు సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు చేరుకునేందుకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. ఎన్నికల పర్యవేక్షణ కోసం ఇద్దరు రూట్ అధికారులను నియమించారు. రూట్ నంబర్ 1కు నవీన్, రూట్ నంబర్ 2కు హరికృష్ణను నియమించారు. వీరు ఎన్నికల సమయంలో తమ పరిధిలోని పోలింగ్ కేంద్రాలను సందర్శిస్తూ పోలింగ్ ప్రక్రియను పర్యవేక్షించనున్నారు. మరోవైపు పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. పోలింగ్ కేంద్రాల పరిసరాల్లో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. మండలంలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నికల విధుల కోసం 50 మంది పోలీసు సిబ్బందితో పాటు ఒక సీఐ, ఇద్దరు ఎస్ఐలను కేటాయించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు అన్ని చర్యలు చేపట్టారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Akshara Darshini.
PDF Share Save