గురువారం జరగనున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో నెల్లూరు జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల చేజర్ల పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా చూడాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అప్రమత్తంగా ఉండాలని పోలీస్ సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో సీఐ శ్రీనివాసరెడ్డి, ఎస్సై అయ్యప్ప, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. కాగా చేజర్ల మండలంలో మొత్తం 40 పోలింగ్ కేంద్రాల్లో రేపు ఎన్నికలు జరగనున్నాయి