Akshara Darshini
Date of Publish : 26/10/2026, 11:01 am
Published by Kadiyala Chinmaya Reddy

నెల్లూరు అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం

  • 2027 జూన్ నాటికి అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులు పూర్తి చేస్తాం
  • — మంత్రి నారాయణ

నెల్లూరు,(అక్షర దర్శిని): నెల్లూరు నగర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. నగరంలోని ఎంఎల్‌ఏ కోటంరెడ్డి నివాసంలో కూటమి నేతలు కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నగర అభివృద్ధి పనులు, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనపై చర్చించారు.

నెల్లూరులో ప్రస్తుతం కొనసాగుతున్న అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులను 2027 జూన్ నాటికి పూర్తి చేయనున్నట్లు మంత్రి నారాయణ వెల్లడించారు. నగరంలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంతో పాటు ప్రజలకు ఇబ్బందులు లేకుండా అభివృద్ధి పనులు చేపట్టడంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు.

నెల్లూరు నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, నగర ప్రజలకు అవసరమైన సదుపాయాలను అందించడమే లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. సమావేశంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Akshara Darshini.
PDF Share Save