25/10/2026, Sunday · 11:46:16 PM About UsPrivacy PolicyContact Us
Akshara Darshini

బిరదవోలులో జోరందుకున్న సైకిల్ ప్రచారం!

Kadiyala Chinmaya Reddy 25/10/2026 10:47 PM శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు 2

బిరదవోలులో జోరందుకున్న సైకిల్ ప్రచారం!
Want this news as a newspaper clip?Print News Clip
  • ➖కదం తొక్కిన టీడీపీ శ్రేణులు.. ఇంటింటికీ విస్తృత ప్రచారం
  • ➖ఎంపీటీసీ అభ్యర్థి అన్నలూరు సుమలత, జడ్పీటీసీ అభ్యర్థి కలిచేటి ప్రభాకర్ రెడ్డికి మద్దతుగా ప్రచారం
  • ➖సైకిల్ గుర్తుపై ఓటేసి గెలిపించండి.. అభివృద్ధికి పట్టం కట్టండి
  • ➖టీడీపీ మండల అధ్యక్షుడు తలచీరు మస్తాన్ బాబు పిలుపు..
  • ➖బిరదవోలులో సైకిల్ స్పీడ్.. కార్యకర్తల్లో జోష్!

పొదలకూరు,(అక్షర దర్శిని): పొదలకూరు మండలంలోని బిరదవోలు ఎంపీటీసీ సెగ్మెంట్‌లో తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. పరిషత్ ఎన్నికల నేపథ్యంలో గత రెండు రోజులుగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తూ ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం కళ్యాణపురం లో బిరదవోలు ఎంపీటీసీ అభ్యర్థి అన్నలూరు సుమలత, పొదలకూరు జడ్పీటీసీ అభ్యర్థి కలిచేటి ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తూ ప్రచారం నిర్వహించారు. సైకిల్ గుర్తుపై ఓటేసి అభ్యర్థులకు అండగా నిలవాలని కోరుతూ ప్రజల్లోకి వెళ్తున్నారు.

అభివృద్ధి, సంక్షేమానికి టీడీపీనే దిక్సూచి

ఈ సందర్భంగా టీడీపీ మండల అధ్యక్షుడు తలచీరు మస్తాన్ బాబు మాట్లాడుతూ రాష్ట్రంతో పాటు గ్రామాల్లో నిరంతర అభివృద్ధి కొనసాగాలంటే టీడీపీ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో టీడీపీ ప్రభుత్వం ముందుంటోందని పేర్కొన్నారు. ప్రజల అవసరాలను గుర్తించి సంక్షేమ పథకాలను అమలు చేస్తూ అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తోందన్నారు.

సంక్షేమ పథకాలతో ప్రజలకు భరోసా

వృద్ధులు, వితంతువులకు నెలకు రూ.4 వేల పింఛను, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు వంటి పథకాలు ప్రజలకు ఉపయోగపడుతున్నాయని మస్తాన్ బాబు వివరించారు. తల్లికి వందనం పథకం ద్వారా విద్యార్థులకు ఆర్థిక సాయం అందిస్తున్నట్లు తెలిపారు. అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు ఏడాదికి రూ.20 వేల ఆర్థిక సాయం అందిస్తున్నామని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పక్కా ఇళ్లు, పింఛన్లు మంజూరు చేసే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.

సైకిల్ గుర్తుకు ఓటేయండి.. అభ్యర్థులను గెలిపించండి

గ్రామాల అభివృద్ధి, ప్రజా సంక్షేమం నిరంతరం కొనసాగాలంటే పరిషత్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను ప్రజలు ఆదరించి ఆశీర్వదించాలని మస్తాన్ బాబు కోరారు. బిరదవోలు ఎంపీటీసీ అభ్యర్థి అన్నలూరు సుమలత, జడ్పీటీసీ అభ్యర్థి కలిచేటి ప్రభాకర్ రెడ్డికి సైకిల్ గుర్తుపై ఓటేసి ఘన విజయం అందించాలని విజ్ఞప్తి చేశారు. అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ముందుకు సాగుతున్నారని తెలిపారు.

ప్రచారంలో పాల్గొన్న టీడీపీ శ్రేణులు

ఈ కార్యక్రమంలో మండల తెలుగు యువత అధ్యక్షుడు వెన్నపూస రాజశేఖర్ రెడ్డి, టీడీపీ నాయకులు అన్నలూరు చెన్నకృష్ణమ నాయుడు, అక్కెం బుజ్జిరెడ్డి, యత్తపు వెంకటరెడ్డి, వెన్నపూస రమణారెడ్డి, రావుల శ్రీనివాసులు గౌడ్, రావుల భాస్కర్ గౌడ్, వెంపులూరు రామకృష్ణ గౌడ్, వెంపులూరు బాలకృష్ణ, గూడూరు శ్రీనివాసులు, తాటికొండ రమేష్, నాగేళ్ల వెంకటేశ్వర్లు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి :: గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల ప్రచారం

బిరదవోలులో జోరందుకున్న సైకిల్ ప్రచారం!
బిరదవోలులో జోరందుకున్న సైకిల్ ప్రచారం!
బిరదవోలులో జోరందుకున్న సైకిల్ ప్రచారం!

Cycle CampaignBiradolu

About the author

Kadiyala Chinmaya Reddy

Kadiyala Chinmaya Reddy

Chief Editor

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

42 Posts

Latest News