25/10/2026, Sunday · 11:46:00 PM About UsPrivacy PolicyContact Us
Akshara Darshini

నెల్లూరు అభివృద్ధికి నారాయణ ప్రత్యేక ప్రణాళికలు

Kadiyala Chinmaya Reddy 25/10/2026 11:01 PM శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు 1

నెల్లూరు అభివృద్ధికి నారాయణ ప్రత్యేక ప్రణాళికలు
Want this news as a newspaper clip?Print News Clip
  • త్వరలోనే అతిపెద్ద మార్కెట్‌ యార్డు.. డంపింగ్‌ యార్డు స్థానంలో అమ్యూజ్‌మెంట్‌ పార్క్‌
  • ఎన్నికల ప్రచారంలో మంత్రి నారాయణ కుమార్తె డాక్టర్‌ సింధూర

నెల్లూరు,(అక్షర దర్శిని): నగరంలో చేపట్టిన అభివృద్ధి పనులు అన్ని ప్రాంతాల్లో కనిపిస్తున్నాయని మంత్రి పొంగూరు నారాయణ కుమార్తె డాక్టర్‌ సింధూర పేర్కొన్నారు. నెల్లూరు నగర ఎమ్మెల్యేగా నారాయణ ఎన్నిక కావడం నగర ప్రజల అదృష్టమని ఆమె అభిప్రాయపడ్డారు. రానున్న రోజుల్లో నెల్లూరు నగరాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని తెలిపారు.

ఆదివారం నెల్లూరు నగరంలోని 14, 18వ డివిజన్లలో తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్‌ అభ్యర్థులు కువారపు బాలాజీ, గొడ్డేటి లక్ష్మితో కలిసి డాక్టర్‌ సింధూర ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికులు ఆమెకు స్వాగతం పలికారు. రోడ్‌షోలో పాల్గొన్న ఆమెకు గజమాలతో సత్కారం చేశారు.

ఈ సందర్భంగా డాక్టర్‌ సింధూర మాట్లాడుతూ.. ఆయా డివిజన్ల పరిధిలో విశాలమైన రహదారులు, పార్కులు, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ వంటి సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలిపారు. నగరంలో పచ్చదనాన్ని పెంపొందించే లక్ష్యంతో మొక్కలు నాటడం అభినందనీయమన్నారు. ప్రభుత్వ పాఠశాలలను ఆధునికీకరించి, నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు మంత్రి నారాయణ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.

నగరానికి మరో ప్రధాన ప్రాజెక్టుగా దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద మార్కెట్‌ యార్డు ఏర్పాటుకు శంకుస్థాపన చేసినట్లు తన దృష్టికి వచ్చిందని ఆమె తెలిపారు. అల్లిపురం డంపింగ్‌ యార్డులో పేరుకుపోయిన సుమారు 70 లక్షల టన్నుల చెత్తను తొలగించి, ఆ ప్రాంతంలో అమ్యూజ్‌మెంట్‌ పార్కు ఏర్పాటు చేయాలన్నది మంత్రి నారాయణ సంకల్పమని చెప్పారు. ముంబై, చెన్నై, బెంగళూరు వంటి మహానగరాల్లో కనిపించే తరహా వినోద కేంద్రం నెల్లూరులో ఏర్పాటు కానుండటం నగరానికి ఉపయోగకరంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు.

రానున్న రెండేళ్లలో నెల్లూరు నగరాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. నగరంలో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగించేందుకు మేయర్‌ అభ్యర్థి రూప్‌కుమార్‌ యాదవ్‌తో పాటు 14, 18వ డివిజన్ల టీడీపీ కార్పొరేటర్‌ అభ్యర్థులు గొడ్డేటి లక్ష్మి, కువారపు బాలాజీలకు మద్దతు ఇవ్వాలని ఓటర్లను కోరారు.

ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి :: గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల ప్రచారం

నెల్లూరు అభివృద్ధికి నారాయణ ప్రత్యేక ప్రణాళికలు
నెల్లూరు అభివృద్ధికి నారాయణ ప్రత్యేక ప్రణాళికలు
నెల్లూరు అభివృద్ధికి నారాయణ ప్రత్యేక ప్రణాళికలు

Special PlansNarayanaNelloreDevelopment

About the author

Kadiyala Chinmaya Reddy

Kadiyala Chinmaya Reddy

Chief Editor

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

42 Posts

Latest News