26/10/2026, Monday · 12:05:05 AM About UsPrivacy PolicyContact Us
Akshara Darshini

కూటమిలో చిచ్చు పెట్టే వైసీపీ కుట్రలు సాగవు

Kadiyala Chinmaya Reddy 25/10/2026 11:06 PM శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు 1

కూటమిలో చిచ్చు పెట్టే వైసీపీ కుట్రలు సాగవు
Want this news as a newspaper clip?Print News Clip
  • మంత్రి నారాయణపై దుష్ప్రచారాన్ని ఖండించిన జనసేన వీరమహిళలు
  • కూటమి అభ్యర్థుల విజయానికి టీడీపీ పూర్తి సహకారం

నెల్లూరు,(అక్షర దర్శిని): నెల్లూరు నగర కార్పొరేషన్‌ ఎన్నికల వేళ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి మధ్య విభేదాలు ఉన్నాయంటూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ చేస్తున్న ప్రచారాన్ని జనసేన మహిళా అభ్యర్థులు ఖండించారు. మంత్రి పొంగూరు నారాయణపై ఉద్దేశపూర్వకంగా అసత్య ప్రచారం చేస్తూ కూటమిలో చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు తమకు పూర్తి సహకారం అందిస్తున్నారని స్పష్టం చేశారు.

నెల్లూరులోని జేమ్స్‌ గార్డెన్‌లో ఉన్న రూప్‌కుమార్‌ కార్యాలయంలో ఆదివారం జనసేన వీరమహిళలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా 71వ డివిజన్‌ జనసేన అభ్యర్థి అలియా మాట్లాడుతూ.. కూటమి పొత్తులో భాగంగా జనసేనకు చెందిన ముగ్గురు మహిళలకు కార్పొరేటర్లుగా పోటీ చేసే అవకాశం లభించిందన్నారు. మంత్రి నారాయణ సూచనలతో టీడీపీ శ్రేణులు తమ విజయానికి కృషి చేస్తున్నాయని తెలిపారు. జనసేన పోటీ చేస్తున్న డివిజన్లలోనూ మంత్రి అన్ని విధాలా సహకరిస్తున్నారని పేర్కొన్నారు. నారాయణ చేపట్టిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నామని, ప్రజల నుంచి సానుకూల స్పందన వస్తోందని చెప్పారు. పవన్‌ కల్యాణ్‌ నాయకత్వంలో కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేస్తున్నామని వెల్లడించారు.

అభివృద్ధే మా ప్రచార అస్త్రం

21వ డివిజన్‌ జనసేన అభ్యర్థి గునుకుల విజయలక్ష్మి మాట్లాడుతూ.. జనసేనకు ఓటు వేయవద్దని మంత్రి నారాయణ ఎక్కడా చెప్పలేదని స్పష్టం చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య ఎలాంటి విభేదాలు లేవని పేర్కొన్నారు. నగరంలో మంత్రి చేపట్టిన అభివృద్ధి పనులు తమ ఎన్నికల ప్రచారానికి తోడ్పడుతున్నాయని తెలిపారు. మంత్రి సతీమణి రమాదేవి, కుమార్తెలు డాక్టర్‌ సింధూర, షరణి సైతం కూటమి అభ్యర్థుల విజయానికి ప్రచారం నిర్వహిస్తున్నారని చెప్పారు. కూటమిలో విభేదాలు ఉన్నాయంటూ జరుగుతున్న ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని కోరారు.

కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యం

15వ డివిజన్‌ జనసేన అభ్యర్థి కెజియా కుమారి మాట్లాడుతూ.. మంత్రి నారాయణకు ప్రజల్లో ఉన్న ఆదరణ తమ ప్రచారానికి ఉపయోగపడుతోందన్నారు. మంత్రి తమకు గుర్తింపు, గౌరవం ఇస్తూ సహకరిస్తున్నారని తెలిపారు. కూటమి అభ్యర్థుల మధ్య విభేదాలు ఉన్నాయంటూ చేస్తున్న ప్రచారాన్ని నమ్మకుండా, కూటమి తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని ఓటర్లను కోరారు.

కూటమి ఐక్యతను దెబ్బతీసే ప్రయత్నాలు ఫలించవని జనసేన మహిళా అభ్యర్థులు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థుల విజయానికి సమన్వయంతో పనిచేస్తామని వెల్లడించారు.

ఇవి కూడా చదవండి :: గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల ప్రచారం

YCP conspiraciesspillallianceaway

About the author

Kadiyala Chinmaya Reddy

Kadiyala Chinmaya Reddy

Chief Editor

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

42 Posts

Latest News