26/10/2026, Monday · 11:06:16 AM About UsPrivacy PolicyContact Us
Akshara Darshini

పొదలకూరు ఎంపీటీసీ అభ్యర్థులకు విజ్ఞప్తి..

Kadiyala Chinmaya Reddy 26/10/2026 9:48 AM శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు 130

పొదలకూరు ఎంపీటీసీ అభ్యర్థులకు విజ్ఞప్తి..
Want this news as a newspaper clip?Print News Clip
  • నామినేషన్ల ఉపసంహరణ, బి-ఫారాల స్వీకరణ సమయాలు ఖరారు..

పొదలకూరు,(అక్షర దర్శిని):

పొదలకూరు మండలంలో ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియ జోరందుకుంది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణ పత్రాలు (Withdrawal Forms) మరియు రాజకీయ పార్టీలకు చెందిన 'బి-ఫారాలు' (B-Forms) స్వీకరించేందుకు నిర్దిష్ట సమయాలను ఖరారు చేసినట్లు పొదలకూరు మండల ఎంపీటీసీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి సీ హెచ్ విజయకుమార్ రెడ్డి సోమవారం తెలిపారు.

ఈ రోజు అనగా

 అక్టోబర్ 26 సోమవారం, ఉదయం 10:30 గంటల నుండి సాయంత్రం 5:00 గంటల వరకు మంగళవారం ఉదయం 10-30 గంటల నుంచి సాయంత్రం 3-00

గంటల వరకు మాత్రమే పోటీలో ఉన్న అభ్యర్థుల నుంచి ఉపసంహరణ మరియు బి ఫామ్ స్వీకరణకు అవకాశం ఉంటుందని తెలిపారు.

రాజకీయ పార్టీల ప్రతినిధులు, పోటీలో ఉన్న అభ్యర్థులు ఈ విషయాలను గమనించి, నిర్ణీత గడువు లోపల తమ ఉపసంహరణ పత్రాలు లేదా బి-ఫారాలను సంబంధిత అధికారులకు సమర్పించాలని రిటర్నింగ్ అధికారి విజయకుమార్ రెడ్డి సూచించారు.

ఇవి కూడా చదవండి :: నెల్లూరులో హరిత టూరిజంలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి

MPTC CandidatesAppealPodalakur

About the author

Kadiyala Chinmaya Reddy

Kadiyala Chinmaya Reddy

Chief Editor

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

45 Posts

Latest News