26/10/2026, Monday · 11:04:12 AM About UsPrivacy PolicyContact Us
Akshara Darshini

నెల్లూరులో హరిత టూరిజంలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి

Kadiyala Chinmaya Reddy 26/10/2026 10:12 AM శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు 46

నెల్లూరులో హరిత టూరిజంలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి
Want this news as a newspaper clip?Print News Clip
  • ఎనిమిది మంది అరెస్ట్‌.. రూ.3.53 లక్షలు స్వాధీనం

నెల్లూరు(అక్షర దర్శిని): నెల్లూరు నగరంలోని హరిత టూరిజం హోటల్‌లో పేకాట ఆడుతున్న స్థావరంపై పోలీసులు దాడి చేసి ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ దాడి ఏఎస్పీ దీక్ష ఆధ్వర్యంలో, నాలుగో పట్టణ సీఐ కళ్యాణ్ రాజు నేతృత్వంలో జరిగినట్లు తెలిసింది.

హోటల్‌లో పేకాట ఆడుతున్నారనే సమాచారంతో పోలీసులు దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా పేకాట ఆడుతున్న ఎనిమిది మందిని పట్టుకుని, వారి వద్ద నుంచి రూ.3.53 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

పట్టుబడిన వారిలో టిప్పర్ యజమానులతో పాటు అధికార పార్టీకి చెందిన వ్యక్తులు కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, నిందితుల వివరాలు, వారి రాజకీయ అనుబంధంపై అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది.

ఈ ఘటనకు సంబంధించి పోలీసులు పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉంది. పేకాట నిర్వహణ వెనుక ఎవరెవరు ఉన్నారు? హోటల్‌లో ఈ వ్యవహారం ఎంతకాలంగా కొనసాగుతోంది? అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి :: పొదలకూరు ఎంపీటీసీ అభ్యర్థులకు విజ్ఞప్తి..

నెల్లూరులో హరిత టూరిజంలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి
నెల్లూరులో హరిత టూరిజంలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి

Pekata BasePoliceraidGreenTourismNellore

About the author

Kadiyala Chinmaya Reddy

Kadiyala Chinmaya Reddy

Chief Editor

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

45 Posts

Latest News