31/10/2026, Saturday · 01:25:20 PM About UsPrivacy PolicyContact Us
Akshara Darshini

ఓటమి భయంతోనే కక్ష రాజకీయాలు!

hameed 31/10/2026 12:16 PM శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు 7

ఓటమి భయంతోనే కక్ష రాజకీయాలు!
Want this news as a newspaper clip?Print News Clip
  • కుట్రలు, కేసులు ఎన్ని పెట్టినా పోరాటం ఆపం.. ప్రజల మద్దతే తమకు కొండంత బలమన్న వైసీపీ నేతలు

పొదలకూరు: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి భయంతోనే పోలీసులు, నోటీసులను అడ్డుపెట్టుకుని కక్షసాధింపు రాజకీయాలకు పాల్పడుతున్నారని వైఎస్సార్‌సీపీ నాయకులు ఆరోపించారు. అక్రమ కేసులు, అరెస్టులు, పోలీసు నోటీసులతో తమను భయపెట్టాలని చూస్తే వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు.పొదలకూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో వాకాటి శ్రీనివాసులరెడ్డి, బిట్‌–2 ఎంపీటీసీ అభ్యర్థి వాకాటి సంధ్య, వాకాటి శివారెడ్డి, అంజాద్ తదితరులు మాట్లాడారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న సమయంలోనే తమ కుటుంబానికి నోటీసులు, కేసుల పేరుతో ఇబ్బందులు కలిగిస్తున్నారని వాకాటి శ్రీనివాసులరెడ్డి ఆరోపించారు. గతంలోనూ తమ కుటుంబం అనేక ఇబ్బందులు ఎదుర్కొందని, అయినా ప్రజల కోసం పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.

రుస్తుం మైన్‌తో తమకు ఎలాంటి సంబంధం లేదని వాకాటి శివారెడ్డి స్పష్టం చేశారు. ఈ విషయంలో తాము ప్రమాణం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి కూడా ప్రమాణానికి సిద్ధమా అని ప్రశ్నించారు. నిరాధార ఆరోపణలతో తమను రాజకీయంగా దెబ్బతీయాలని చూస్తున్నారని మండిపడ్డారు.

వైఎస్సార్‌సీపీ నాయకుడు అంజాద్ మాట్లాడుతూ పోలీసులను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేయకుండా ప్రజల మధ్య ఎన్నికల్లో తేల్చుకోవాలని సవాల్ చేశారు. ఎన్ని కేసులు, నోటీసులు వచ్చినా భయపడేది లేదని, ప్రజాబలంతోనే ఎదుర్కొంటామని స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి :: మడపల్లిలో జడ్పీటీసీ అభ్యర్థి రావి మల్లేశ్వరి ఎన్నికల ప్రచారం

ఓటమి భయంతోనే కక్ష రాజకీయాలు!

politics outPartisanfeardefeat

About the author

hameed

hameed

Reporter

10 Posts

Latest News

తెలుగురాయపురంలో టీడీపీ అభ్యర్థి విస్తృత ప్రచారం.. వీర్ గాథ 6.0లో ఆదురుపల్లి విద్యార్థులకు ప్రశంసా పత్రాలు ఇస్రో మరో ఘనత.. నింగిలోకి ఎన్‌ఎస్‌ఎల్‌వీ-03 ఉపగ్రహం! ఇస్రో మరో ఘనత.. నింగిలోకి ఎన్‌ఎస్‌ఎల్‌వీ-03 ఉపగ్రహం! అక్షర దర్శిని కథనానికి స్పందన.. బ్రిడ్జికి తాత్కాలిక మరమ్మతులు చేపట్టిన అధికారులు! ఏపీఎన్‌విఎఫ్ నెల్లూరు జిల్లా నూతన కార్యవర్గం ఎంపిక. మడపల్లిలో జడ్పీటీసీ అభ్యర్థి రావి మల్లేశ్వరి ఎన్నికల ప్రచారం ప్రచారంలో దూసుకుపోతున్న టీడీపీ జడ్పీటీసీ అభ్యర్థి అరవ లిఖిత. బ్రాహ్మణపల్లిలో పిచ్చికుక్క బీభత్సం.. ఒకే రోజు 16 మందిపై దాడి!* చిన్నారి జలాల్‌ ప్రాణాలు నిలపడానికి దాతల సాయం కావాలి!