26/10/2026, Monday · 06:49:13 PM About UsPrivacy PolicyContact Us
Akshara Darshini

కలువాయిలో ఘనంగా శ్రీ మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు.

shafi 26/10/2026 3:42 PM శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు 5

కలువాయిలో ఘనంగా శ్రీ మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు.
Want this news as a newspaper clip?Print News Clip

నెల్లూరు జిల్లా కలువాయి మండలంలో రాష్ట్ర పండుగగా నిర్వహించే శ్రీ మహర్షి వాల్మీకి జయంతిని పురస్కరించుకుని కలువాయి వెస్ట్ స్కూల్‌లో విద్యార్థులకు నోటుబుక్స్, పెన్నులు, స్వీట్స్ పంపిణీ చేశారు. వాల్మీకి మహర్షి వారసులుగా చెప్పుకోవడం గర్వకారణమని భావిస్తూ వాల్మీకి యూత్‌కు చెందిన మండ్ల మస్తానయ్య విద్యార్థులకు అవసరమైన విద్యా సామగ్రిని అందజేసి తన అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు నోటుబుక్స్, పెన్నులు పంపిణీ చేయడంతో పాటు స్వీట్స్ అందించి వారిలో ఆనందాన్ని నింపారు. విద్యార్థులను ప్రోత్సహించడం, చదువుపై ఆసక్తి పెంపొందించడం, మహర్షి వాల్మీకి ఆశయాలను భావితరాలకు తెలియజేయడం లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. మహర్షి వాల్మీకి జీవితం, ఆయన రచించిన రామాయణం సమాజానికి అందించిన సందేశాలు ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమని, ఆయన బోధించిన విలువలను విద్యార్థులు అలవర్చుకోవాలని ఆకాంక్షించారు. వాల్మీకి జయంతి సందర్భంగా విద్యార్థులకు విద్యా సామగ్రి అందజేయడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి :: పొదలకూరు ఎంపీటీసీ అభ్యర్థులకు విజ్ఞప్తి..

Maharshi ValmikiBirthdaycelebrationsSriKaluwai

About the author

S

shafi

Reporter

3 Posts

Latest News