26/10/2026, Monday · 06:49:48 PM About UsPrivacy PolicyContact Us
Akshara Darshini

వేపినాపిలో విషాదం.. విద్యుత్ షాక్‌తో షిఫ్ట్ ఆపరేటర్ మృతి!

Kadiyala Chinmaya Reddy 26/10/2026 4:11 PM శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు 6

వేపినాపిలో విషాదం.. విద్యుత్ షాక్‌తో షిఫ్ట్ ఆపరేటర్ మృతి!
Want this news as a newspaper clip?Print News Clip

రాపూరు,(అక్షర దర్శిని):నెల్లూరు జిల్లా రాపూరు మండలం వేపినాపిలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. విద్యుత్ స్తంభంపై వీధి దీపాలు బిగిస్తుండగా విద్యుత్ షాక్‌కు గురై షిఫ్ట్ ఆపరేటర్ మృతి చెందాడు. రాపూరు మండలం తెగచర్ల పంచాయతీ పరిధిలోని నాగోర్‌పల్లి గ్రామానికి చెందిన రవీంద్ర(35) వేపినాపి విద్యుత్ సబ్‌స్టేషన్‌లో షిఫ్ట్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. విధుల్లో లేని సమయంలో వేపినాపి పంచాయతీలో ప్రైవేటుగా విద్యుత్ పనులు చేస్తుంటాడు. ఈ క్రమంలో గ్రామంలో విద్యుత్ స్తంభానికి వీధి దీపాలు బిగిస్తుండగా విద్యుత్ షాక్‌కు గురై కిందపడి మృతి చెందాడు. మృతుడు రవీంద్రకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. కుటుంబ పెద్ద ఆకస్మికంగా మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి. సమాచారం అందుకున్న రాపూరు పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి :: పొదలకూరు ఎంపీటీసీ అభ్యర్థులకు విజ్ఞప్తి..

operator diesShiftelectricshockVepinapi

About the author

Kadiyala Chinmaya Reddy

Kadiyala Chinmaya Reddy

Chief Editor

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

53 Posts

Latest News