27/10/2026, Tuesday · 04:27:50 PM About UsPrivacy PolicyContact Us
Akshara Darshini

టీడీపీ జిల్లా రాజకీయాల్లో మరోసారి వర్గ విభేదాల చర్చ!

Kadiyala Chinmaya Reddy 27/10/2026 3:31 PM రాష్ట్ర వార్తలు 1

టీడీపీ జిల్లా రాజకీయాల్లో మరోసారి వర్గ విభేదాల చర్చ!
Want this news as a newspaper clip?Print News Clip
  • జడ్పీటీసీ బీ-ఫారాల వ్యవహారంపై మంత్రి ఆనం ఆగ్రహం?
  • బీదా రవిచంద్ర,డూండి రాకేష్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు ప్రచారం

 నెల్లూరు,(అక్షర దర్శిని): 

నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీలో జడ్పీటీసీ అభ్యర్థులకు బీ-ఫారాల పంపిణీ వ్యవహారం రాజకీయ చర్చకు దారితీసింది. జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు బీదా రవిచంద్ర జడ్పీటీసీ అభ్యర్థులకు బీ-ఫారాలు అందజేసిన నేపథ్యంలో, ఆత్మకూరు నియోజకవర్గానికి సంబంధించిన అభ్యర్థుల ఎంపిక, పార్టీ నాయకుల మధ్య సమన్వయం అంశాలు తెరపైకి వచ్చినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

తన నియోజకవర్గంలో పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని భావిస్తున్న నాయకుల సూచనల మేరకు జడ్పీటీసీ బీ-ఫారాలు ఎలా కేటాయిస్తారనే అంశంపై మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. పార్టీ కార్యాలయానికి సంబంధిత నాయకులను ఎలా అనుమతిస్తారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. అయితే ఈ పరిణామాలపై సంబంధిత నాయకుల అధికారిక వివరణ వెలువడాల్సి ఉంది.

జిల్లా టీడీపీ అధ్యక్షుడు బీదా రవిచంద్ర, జిల్లా పార్టీ పరిశీలకుడు గుండి రాకేష్ వ్యవహారశైలిపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేసినట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో, జిల్లాలో పార్టీ నాయకుల మధ్య సమన్వయంపై చర్చ మొదలైంది. పార్టీ అంతర్గత వ్యవహారాల్లో తలెత్తుతున్న విభేదాలను సకాలంలో పరిష్కరించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇదిలా ఉండగా, జిల్లా పరిషత్ చైర్మన్ అభ్యర్థి ఎంపిక సమయంలోనూ నాయకుల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనట్లు గతంలో చర్చ జరిగింది. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి సూచించినట్లు ప్రచారంలో ఉన్న పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి పేరుకు, బీదా రవిచంద్ర మద్దతు తెలిపినట్లు చెప్పబడుతున్న వంటేరు వేణుగోపాల్‌రెడ్డి పేరుకు మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయనే ప్రచారం సాగింది. చివరకు పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ అభ్యర్థిగా ముందుకు వచ్చినట్లు రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.తాజాగా జడ్పీటీసీ బీ-ఫారాల పంపిణీ వ్యవహారం ఈ చర్చలకు మరింత ఆజ్యం పోసినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా ఆత్మకూరు నియోజకవర్గంలో మంత్రి ఆనం వర్గానికి, ఇతర స్థానిక నాయకులకు మధ్య ఉన్నట్లు చెబుతున్న విభేదాలు పార్టీ అభ్యర్థుల ఎంపికపై ప్రభావం చూపాయా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

జిల్లా రాజకీయాల్లో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, జిల్లా అధ్యక్షుడు బీదా రవిచంద్ర తదితర నాయకుల మధ్య సమన్వయం కీలకంగా మారింది. పార్టీ అంతర్గత విభేదాలపై అధిష్ఠానం ఏ విధంగా స్పందిస్తుంది? అభ్యర్థుల ఎంపిక విషయంలో నాయకుల మధ్య ఏకాభిప్రాయం సాధిస్తారా? అన్నది రాజకీయంగా ఆసక్తికరంగా మారింది.

జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన బీ-ఫారాల పంపిణీ కార్యక్రమంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డితో పాటు జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి :: కూటమి ప్రభుత్వంలో పంచాయతీ పాలన నిర్వీర్యం...వెంకీ యాదవ్

టీడీపీ జిల్లా రాజకీయాల్లో మరోసారి వర్గ విభేదాల చర్చ!
టీడీపీ జిల్లా రాజకీయాల్లో మరోసారి వర్గ విభేదాల చర్చ!

vibhedala charchatidipijillarajakiyallomarosarivarga

About the author

Kadiyala Chinmaya Reddy

Kadiyala Chinmaya Reddy

Chief Editor

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

57 Posts

Latest News