స్థానిక ఎన్నికల్లో వైసీపీకి ఓటమి తప్పదు..

- ️ టీడీపీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలి..
- ️ మర్రిపల్లిలో వైసీపీకి షాక్.. టీడీపీలో చేరిన 10 కుటుంబాలు..
- ️ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించిన ఎమ్మెల్యే సోమిరెడ్డి..
- ️ మర్రిపల్లిలో టీడీపీ అభ్యర్థులతో కలిసి ఇంటింటా ఎన్నికల ప్రచారం..
స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాజయం తప్పదని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. సోమవారం పొదలకూరు మండలంలోని మర్రిపల్లి గ్రామంలో టీడీపీ జడ్పీటీసీ అభ్యర్థి కలిచేటి ప్రభాకర్ రెడ్డి, బిరదవోలు ఎంపీటీసీ అభ్యర్థిణి అన్నలూరు సుమలతతో కలిసి ఆయన ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామంలోని వీధుల్లో పర్యటిస్తూ ప్రజలను ఆప్యాయంగా పలకరించి, టీడీపీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
మర్రిపల్లిలో వైసీపీకి ఎదురుదెబ్బ..
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మర్రిపల్లి గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. గ్రామానికి చెందిన 10 కుటుంబాలు వైసీపీని వీడి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరాయి. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారికి సోమిరెడ్డి టీడీపీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. పార్టీ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. టీడీపీ విధానాలు, కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నుంచి టీడీపీలో చేరుతున్నారని పేర్కొన్నారు.అనంతరం సోమిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం, గ్రామీణాభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతోందన్నారు. గత వైసీపీ పాలనలో గ్రామాల అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని విమర్శించారు. ప్రజల సమస్యలను పట్టించుకోకుండా వైసీపీ నాయకులు రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇచ్చారని ఆరోపించారు. వైసీపీ పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.
సర్వేపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని సోమిరెడ్డి స్పష్టం చేశారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, రహదారుల అభివృద్ధి, తాగునీటి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. గ్రామాల అభివృద్ధి మరింత వేగవంతం కావాలంటే స్థానిక సంస్థల్లోనూ టీడీపీ అభ్యర్థులను గెలిపించాల్సిన అవసరం ఉందన్నారు.పొదలకూరు జడ్పీటీసీ అభ్యర్థి కలిచేటి ప్రభాకర్ రెడ్డి, బిరదవోలు ఎంపీటీసీ అభ్యర్థిణి అన్నలూరు సుమలతను భారీ మెజార్టీతో గెలిపించి టీడీపీ సత్తా చాటాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేసి పార్టీ విజయానికి కృషి చేయాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థుల విజయం ఖాయమని సోమిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి :: పొదలకూరు ఎంపీటీసీ అభ్యర్థులకు విజ్ఞప్తి..













