కలువాయి లో పోలీస్ మార్చ్..

- ఎన్నికల వేళ 144 సెక్షన్
నెల్లూరు జిల్లా కలువాయి మండలంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో 144 సెక్షన్‌తో పాటు పోలీస్ యాక్ట్ 30 అమలులో ఉన్నందున పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ సందర్భంగా రాపూరు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కలువాయిలోని పడమటి వీధి నుంచి సాయిబాబా దేవస్థానం వరకు పోలీస్ కవాతు నిర్వహించారు. ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా, ప్రజలు ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకునేలా భద్రతా చర్యల్లో భాగంగా ఈ కవాతు చేపట్టారు. ఎన్నికల నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావివ్వకుండా పోలీసులకు సహకరించాలని అధికారులు సూచించారు. ఈ కార్యక్రమంలో కలువాయి ఎస్సై కోటయ్య, రాపూరు ఎస్సై తిరుమలేశ్వరరావు, సైదాపురం ఎస్సై నాగమల్లేశ్వరరావుతో పాటు రాపూరు సర్కిల్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి :: పొదలకూరు ఎంపీటీసీ అభ్యర్థులకు విజ్ఞప్తి..













